Modi surname case: ‘మోడీ ఇంటిపేరు కేసు’లో నేడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భవితవ్యం తేలిపోనుంది. గుజరాత్ హైకోర్టు ఈ కేసుపై నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో సూరత్ హైకోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజాప్రాతినిద్య చట్టం ప్రకారం ఆయన తన ఎంపీ పదవిని కూడా కోల్పోయారు.
గతంలో ఓ సందర్భంతో రాహుల్ గాంధీకి మధ్యంతర రక్షణను కోర్టు తిరస్కరించింది. అతని అభ్యర్థనను పరిశీలనలో ఉంచింది. ఈ రోజు ఒకవేళ కోర్టు ఈకేసులో కోర్టు స్టే విధిస్తే.. ఆయన అనర్హత రద్దు చేయవచ్చు. తన సస్పెన్షన్‌పై స్టే విధించకపోతే, రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులోని ఉన్నత ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఒక వేళ కోర్టు సూరత్ కోర్టు తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ రెండేళ్లు అదనంగా మరో 6 ఏళ్లు రాజకీయ పదవులకు అనర్హుడు అవుతారు.
Read Also: Indian Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా ఉద్యోగాలు..
కేసు వివరాలు ఇవే:
2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటక కోలార్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇంటిపేరు ఉన్నవారంతా దొంగలే అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువునష్టం దాఖలు చేశారు. ఈ కేసులో మార్చి 23న సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ, రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్లు జైలు శిక్ష విధించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఏవరైన ప్రజాప్రతినిధికి రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం శిక్ష పడితే అతడిపై అనర్హత వేటు పడుతుంది. దీంతో పాటు ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని పార్లమెంట్ సెక్రటేరియట్ అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన తన వయనాడు ఎంపీ స్థానం కోల్పోయారు.