Site icon NTV Telugu

Gujarat Cable Bridge Collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 60 చేరిన మృతుల సంఖ్య.. సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

Gujarat Incident

Gujarat Incident

Gujarat Cable Bridge Collapse..Death toll rises to 60: గుజరాత్ మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది.  అనధికారికంగా 100 మంది వరకు మరణించినట్లు సమాచారం. సమయం గడుస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం సాయంత్ర మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిపోవడంతో ఒక్కసారిగా 500 మంది వరకు సందర్శకులు నదిలో పడిపోయారు. 400 మంది ప్రాణాలు దక్కించుకోగా.. 100కు పైగా మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 60 మంది మరణించినట్లు గుజరాత్ పంచాయితీ మంత్రి బ్రిజేష్ మెర్జా వెల్లడించారు. దీపావళి సెలవులు, వారాంతం కావడంతో ఎక్కువ మంది సందర్శకులు వచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Adipurush: టీజర్ ఎఫెక్ట్.. ఆదిపురుష్ వాయిదా

మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. ఇది బాధకరమైన సంఘటన అని బీజేపీ ఎంపీ మోహన్ భాయ్ కళ్యాన్ జీ కుందారియా అన్నారు. నది నుంచి నీటిని పంప్ చేసేందుకు పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రిని సంఘటన స్థలానికి చేర్చారు. వంతెన సామర్థ్యాన్ని మించి ఒక్కసారిగా జనాలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.

అయితే ఇటీవల ఈ బ్రిడ్జికి రీపేర్లు చేసి అక్టోబర్ 26 నుంచి ప్రజలను తిరిగి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి ప్రారంభించిన ఐదు రోజుల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని మోదీ రూ. 2 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించారు. ఈ గుజరాత్ ప్రభుత్వం మరణించిన వారికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహాయచర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 

Exit mobile version