Site icon NTV Telugu

Gujarat : గుజరాత్‌లో పిడుగుపాటుకు 27 మంది మృతి..పశువులు మృతి..

Lighting

Lighting

ఒకవైపు చలికాలం మొదలైన కూడా.. మరోవైపు భారీ వర్షాలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. గత కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తాజాగా గుజరాత్ లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో జనాలు అనేక ఇబ్బందులకు గురైయ్యారు. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని 251 తాలూకాల్లోని 230 తాలూకాలకు పైగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి..

నిన్న రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.. డౌడ్, భరూచ్, తాపి, అహ్మదాబాద్, అమ్రెల్లి, బనస్కాంత, బొతాద్, ఖేడా, మెహ్ సానా, పంచ్ మహల్, సబర్ కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవభూమి ద్వారకాలో అధిక మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. ఇంకా మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..

ఇక స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నిర్వహించిన డేటా ప్రకారం సోమవారం మధ్యాహ్నం నాటికి పిడుగుపాటుతో 71 జంతువులు కూడా చనిపోయాయి. భారీ వర్షాలకు 23 మంది గాయపడ్డారని, 29 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.. భారీ వర్షాలు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. లోతట్టు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.. ఇక దేశంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలుపుతుంది..

Exit mobile version