Site icon NTV Telugu

Blue Drum: పెళ్లిలో వరుడికి గిఫ్ట్‌గా ‘‘బ్లూ డ్రమ్’’.. ఒక్కసారిగా అంతా షాక్..

Blue Drum

Blue Drum

Blue Drum: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్తని చంపేసి, డెడ్ బాడీని 15 ముక్కలుగా కట్ చేసి, ఒక బ్లూ కలర్ డ్రమ్‌లో పెట్టి, దానిని సిమెంట్‌తో కప్పేశారు. చివరకు సౌరభ్ ఫ్యామిలీ ఫిర్యాదుతో ఈ హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ‘‘బ్లూ డ్రమ్’’ అనేది భయానికి కేరాఫ్‌గా మారింది. ఎవరైనా బ్లూ కలర్ డ్రమ్ కొనుగోలు చేస్తే అనుమానపు చూపులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ హత్య వల్ల బ్లూ డ్రమ్ గిరాకీలు పడిపోయాయి. కొన్ని చోట్ల భార్యలు, తమ భర్తని చంపి బ్లూ కలర్ డ్రమ్‌లో బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.

Read Also: CM Revanth Reddy : జపాన్‌లో ఉద్యోగ అవకాశాలకు తెలంగాణ యువతకు వేదిక.. TOMCOM కీలక ఒప్పందాలు

ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ హమీర్ పూర్‌లో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు అతడికి ‘‘బ్లూ కలర్ డ్రమ్’’ గిఫ్ట్‌గా ఇవ్వడం వైరల్‌గా మారింది. ఒక్కసారిగా ఈ ఘటనలో పెళ్లికి వచ్చిన వారు షాక్ అయ్యారు. పెళ్లికొడుకు సోదరులను ఇది భయపెట్టింది. బహుమతిని చూసిన తర్వాత వరుడు షాక్ అవ్వగా, వధువు నవ్వు ఆపుకోలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హమీర్‌పూర్‌లోని రత్ కొత్వాలి ప్రాంతం, మంగ్రౌల్ గ్రామానికి చెందిన శైలేంద్ర రాజ్‌పుత్ వివాహం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. అతను రిహుంటా గ్రామానికి చెందిన సీమాను వివాహం చేసుకుంటున్నాడు

దీనిపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు. “బహుమతిని చూసిన తర్వాత వరుడు చాలా భయపడ్డాడు, కానీ వధువు నవ్వు ఆపుకోలేకపోయింది.” అంటూ ఒకరు కామెంట్ చేయగా, మరొకరు.. ఇప్పుడు నిజమైన పెళ్లి సరదా ప్రారంభమవుతుంది అని రాసుకొచ్చారు. మరొకరు, సోదరా ఈ గిఫ్ట్‌తో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు.

Exit mobile version