NTV Telugu Site icon

Grand Son Killed Grand Mother: దృశ్యం సినిమాను తలపించిన సీన్.. మంచూరియా తినలేదని అమ్మమ్మను..!

Grand Son Killed Grand Mother

Grand Son Killed Grand Mother

Grand Son Killed Grand Mother: ఐదేళ్ల క్రితం బెంగళూరులో సంచలనం సృష్టించిన మహిళ కేసులో ఎట్టకేలకు నగర పోలీసులు ఛేదించారు. ఇద్దరు ప్రధాన నిందితులను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. నిందితులు సంజయ్, శశికళ తల్లీ కొడుకులు. మరణించిన శాంత కుమారి ఆ యువకుడికి అమ్మమ్మ. ఓ విషయంలో ఆగ్రహంతో అమ్మమ్మను హత్య చేసిన సంజయ్ కి తల్లి శశికళ సాయంతో మృతదేహాన్ని దాచిపెట్టాడు. ఇన్నేళ్ల తర్వాత చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆదృశ్యాలు అచ్చం దృశ్యం సినిమాను తలపించేలా చేశారు కుటుంబ సభ్యులు. సినిమాను మామూలుగా ఫాలో అవ్వలేదుగా అన్నట్లుగా సేమ్‌ టు సేమ్‌ అలానే చేసిన ఓసీన్‌ ను పోలీసులు ఐదేళ్ల తరువాత బయటకు ఆహత్య కేసును తీగలాడితే డొంక కదిలినట్లు బయటకు లాగారు. అసలు ఏంజరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. శశికళ భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. బెంగళూరులోని కెంగేరి శాటిలైట్ కాలనీలో శశికళ తన కుమారుడు సంజయ్, తల్లి శాంత కుమారి (మృతురాలు)తో కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సంజయ్.. చదువులో రాణిస్తున్నాడు. 10వ తరగతి, ఇంటర్‌లో 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. 2016 ఆగస్టులో ఓ రోజు కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా సంజయ్ తన (మృతురాలుశాంత కుమారి) అమ్మమ్మ కోసం గోబీ మంచూరియా తీసుకొచ్చాడు. అయితే మంచూరియా తినేందుకు 69 ఏళ్ల శాంత కుమారి నిరాకరించింది. ఆ మంచూరియాను వద్దంటూ మనవడిపై విసిరింది. దీంతో కోపోద్రిక్తుడైన సంజయ్ వంటగదిలో దొరికిన వస్తువుతో ఆమె తలపై బలంగా కొట్టడంతో.. శాంత కుమారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.

Read also: BRS Banners in AP : ఏపీలో బీఆర్‌ఎస్‌ బ్యానర్లు..

అయితే అప్పటి వరకు పనిలో వున్న శశికళ కొడుకు చేసిన పని చూసి నిర్ఘాంత పోయింది. తన కొడుకుపై పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ.. కన్నపేగు కదా.. తల్లిని సంజయ్ అలా చేయవద్దని వేడుకోవడంతో.. ఆమె ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. మరి మృతదేహాన్ని ఏం చేయాలని అనే ప్రశ్న మొదలైంది. ఎలాగైనా మృతదేహాన్ని ధ్వంసం చేయాలని తల్లీకొడుకులు భావించారు. ఇక చేసేదేమీలేక సంజయ్ తన స్నేహితుడు నందీష్‌ని సహాయం అడుగుతాడు. ఇక, ముగ్గురూ కలిసి శాంత కుమారి మృతదేహాన్ని కొద్దిరోజులుగా ఇంటి అల్మారాలో దాచారు. మృతదేహం దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లారు. చివరకు దృశ్యం సినిమాలో చేసిన సీన్‌ రిపీట్‌ చేశారు. ఇంటి లోపల గోడకు సమీపంలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే… ఎవరూ గుర్తుపట్టకుండా సిమెంటు, ప్లాస్టర్, రంగులు వేశారు. కాగా.. సంజయ్, శశికళ తమ బంధువులకు బాగోలేదని.. ఇంటికి వెళ్తున్నారని అద్దె ఇంటి నుంచి పారిపోయారు.

2017 మే 7న ఇంటిని బాగు చేసేందుకు వచ్చిన యజమాని షాక్ తిన్నాడు. గోడకు సమీపంలో వున్న రక్తపు మరకలతో ఉన్న చీరను చూసి, శాంత కుమారి కనిపించకపోవడంతో పాటు.. తల్లి, కొడుకు కనిపించకుండా పోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గోడ పగులగొట్టడంతో అసలు విషయం బయటపడింది. అయితే.. అప్పట్లో ఈ వార్త చర్చనీయాంశమైంది.. సంజయ్, శశికళ జాగ్రత్తగా ఉన్నారు. మొదట కొన్నాళ్లు స్వగ్రామమైన శివమొగ్గలో ఉంటున్నారు. ఆతర్వాత మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మకాం మార్చుకున్నారు. ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్న సంజయ్.. చివరకు ఓ హోటల్‌లో సప్లయర్‌గా చేరాడు.. అతని తల్లి క్లీనర్‌గా పనిచేసింది. బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడంలో సహకరించిన నందీష్‌ను, సంజయ్, శశికళ కొల్హాపూర్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఐదేళ్లుగా ప్రశ్నార్థంగా మారిన శాంతకుమారి హత్యకు నేటికి తెర దించారు పోలీసులు.
Next CJI: తదుపరి సీజేఐ ఇతనే.. యూయూ లలిత్ సూచన కోరిన కేంద్రం