NTV Telugu Site icon

Uttar Pradesh: ప్రభుత్వ ఆఫర్.. అక్కడ సగం రేటుకే టమోటాలు..!

Tomoto

Tomoto

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జనాలు ఇప్పుడు సగం ధరకే టమోటాలు పొందనున్నారు. వారికి మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఈ సదుపాయం అందించింది అక్కడి ప్రభుత్వం. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సహకారంతో నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్‌ఐ) ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఒక వ్యక్తి రోజుకు 2 కిలోల టమోటాలు మాత్రమే కొనుగోలు చేయాలి.

World Cup: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!

లక్నోలోని మడియాన్వ్ ప్రాంతంలో మొబైల్ వ్యాన్‌ల ద్వారా NCCF ప్రజలకు టమోటాలు అందిస్తోంది. మార్కెట్లలో టమాట ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మొబైల్ వ్యాన్ లలో టమాటా కొనుగోలు చేసే వారు బారులు తీరారు. మరోవైపు ఇలాంటి కార్యక్రమం చేపట్టడంపై.. భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సామాన్యులకు కొంత ఊరట లభించనుంది. మార్కెట్లలో వ్యాపారులు కిలో టమాటా రూ.120 నుంచి 130 వరకు అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల మార్కెట్‌లలో టమాటా 160 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు.

Harassment: 18 మంది బాలికలపై వేధింపులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

పెరుగుతున్న టమాటా ధరలపై కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే మాట్లాడుతూ.. 22 నిత్యావసర వస్తువుల జాబితాలో టమోటాలు, ఉల్లిపాయలు కూడా ఉన్నాయని తెలిపారు. టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం నాఫెడ్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాటిని విక్రయించడం ప్రారంభించిందని తెలిపారు. అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బీహార్ ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ మార్కెటింగ్ ఆపాలని కోరినట్లు పేర్కొన్నారు. కానీ బీహార్ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తుందంటూ విమర్శించారు.