NTV Telugu Site icon

Parliament Session: ఈనెల 17న అఖిలపక్ష సమావేశం..

All Party Meeting

All Party Meeting

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం(జులై17) ఉదయం అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు. జూలై 17న ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీ ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. జులై 18నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాల గురించి ఈ అఖిలపక్ష భేటీలో ప్రస్తావించనున్నారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలను కోరనున్నారు. ముఖ్యమైన బిల్లులపై చర్చలే కాకుండా.. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఈ సెషన్‌లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సెషన్‌కు చాలా ప్రాముఖ్యత చోటుచేసుకుంది.

Draupadi Murmu: ద్రౌపది ముర్కుకి టీడీపీ మద్దతు.. ఆమెకు ఓటెయ్యాలని బాబు పిలుపు

పార్లమెంట్ సమావేశాలు జులై 18న ప్రారంభమై.. ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. భారత రాష్ట్రపతికి ఎన్నిక జూలై 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6, 2022న జరగనుంది. రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారి కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ సమావేశాల్లోనే రెండు రాజ్యాంగ పదవులకు సంబంధించిన కౌంటింగ్ కూడా పార్లమెంట్‌లోనే జరుగనుంది. 2022 శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనేక సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఇదే చివరి సెషన్ కావచ్చని ఆయన ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు.