Site icon NTV Telugu

Bengal Governor: హత్యకు గురైన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్న బెంగాల్ గవర్నర్.. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన గవర్నర్‌

Bengal Governor

Bengal Governor

Bengal Governor: పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల కంటే ముందు ప్రచారం ముగించుకొని తిరిగి ఇంటి వస్తుండగా హత్యకు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తను రాష్ట్ర గవర్నర్‌ సివి ఆనంద బోస్‌ నేడు పరామర్శించనున్నారు. ఇప్పటికే హత్యకు గురైన టీఎంసీ నాయకుడి కుటుంబ సభ్యులతో గవర్నర్‌ ఫోన్‌లో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ రోజు నేరుగా కుటుంబం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అధికారంలో ఉండగా.. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసలో భాగంగా టీఎంసీ నేత ఆదివారం హత్యకు గురయ్యాడు. అతని కుటుంబాన్ని గవర్నర్‌ నేడు పరామర్శించనున్నారు.

Read also: Unemployment Rate : గ్రామాల్లోని యువతకు ఉద్యోగాల్లేవు.. మూడోసారి 8శాతం పెరుగుదల

పంచాయితీ ఎన్నికలకు ముందు జరిగిన హింసాత్మక కాల్పుల ఘటనలో మరణించిన తృణమూల్ కాంగ్రెస్ నేత 52 సంవత్సరాల జియారుల్ మొల్లా కుటుంబంతో బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ ఆదివారం మాట్లాడారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న జియారుల్ మొల్లా ఇంటిని బోస్ ఈరోజు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Read also: Salaar: రారాజు తిరిగొస్తున్నాడు… పట్టాభిషేకం మొదలుపెట్టండి

జియారుల్ మొల్లా ఎన్నికల ప్రచారం ముగించుకొని క్యానింగ్ టౌన్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతను మరణించాడు. తన తండ్రికి ప్రత్యర్థి వర్గం నుంచి ప్రాణహాని ఉందని కథల్‌బేరియా పంచాయతీ నుంచి టీఎంసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన కుమార్తె మన్వారా ఆరోపించింది.
గవర్నర్ ఆనంద బోస్ తాను ప్రయాణిస్తున్న రైలు నుండి ఫోన్‌లో TMC కార్మికుడి కుటుంబాన్ని ఓదార్చిన వీడియో రాజ్‌ భవన్‌ వర్గాలు షేర్‌ చేశాయి. కాల్పుల్లో మరణించిన జియారుల్‌ మొల్లా కుటుంబాన్ని పరామర్శించి.. పరిస్థితిని సమీక్షించనున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జూన్ 9 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో గ్రామీణ ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 10 మంది మరకు మరణించారు. రాష్ట్రంలో ఈ నెల 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Exit mobile version