NTV Telugu Site icon

PM Modi: రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తోంది..ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు..

Pm Modi

Pm Modi

PM Modi: పంటకు కనీస మద్దతు(ఎంఎస్‌పీ) చట్టంతో సహా 12 హామీలను అమలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ‘ఢిల్లీ ఛలో’ పేరుతో దేశ రాజధాని ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, వీరందరిని హర్యానా-ఢిల్లీ బోర్డర్‌లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. కేంద్రమంత్రులు, రైతు సంఘాల నేతలతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఆందోళన విరమణపై హామీ రాలేదు.

Read Also: Patnam Mahender Reddy: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులు

ఇదిలా ఉంటే రైతు ఉద్యమ నేపథ్యంలో హర్యానాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు మేలు చేసే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని శుక్రవారం అన్నారు. రైతుల బ్యాంకు రుణాలకు తమ ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శుక్రవారం నాలుగో రోజుకు చేరిన రైతుల ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

హర్యానా రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ, కేంద్రంలోని తమ బీజేపీ ప్రభుత్వం రైతులకు ప్రయోజనాలు అందించేందుకు పనిచేస్తుందని అన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు కేంద్రం రైతులకు ‘గ్యారంటీ’ ఇచ్చిందని, ఇంతకు ముందు వాటిని తిరస్కరించారని ప్రధాని అన్నారు.