Site icon NTV Telugu

Gorakpur: ఎవర్రా మీరంతా.. 15 ఏళ్ల బాలుడిపై అమ్మాయి అత్యాచారం..

Sam (6)

Sam (6)

సాధారణంగా మహిళపై కొందరు కామాంధులు రెచ్చిపోయి దారుణాలకు తెగబడతారు.. అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ యువ‌తి కామంతో రెచ్చిపోయి…15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారానికి తెగబడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..మ‌న దేశంలో అనేక ర‌కాల దారుణ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. గోరఖ్ పూర్ లో 19 ఏళ్ల ఓ యువతి.. 15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారం చేసింది. రూంలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వాలని బాలుడిని టార్చర్ చేసింది.

19 ఏళ్ల అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 15 ఏళ్ల అబ్బాయిని పరిచయం చేసుకుంది. అనంతరం అతడిని హోటల్ కు రప్పించి అత్యాచారం చేసింది. ఆ తరువాత ఫేక్ ప్రెగ్నెన్సీ పేరుతో అతన్ని డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసింది. బెడ్ రూం వీడియోలు ఉన్నాయ‌ని….ఆ కుర్రాడి కుటుంబ స‌భ్యులు ఫోన్లు చేసి… ₹12 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో ఈ సంఘ‌ట‌న‌పై కుర్రాడి త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… ఆమెను అరెస్ట్ చేసి.. ఆరా తీస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ యువ‌తి వివ‌రాలు కూడా పోలీసులు తెల‌ప‌డం లేదు.

Exit mobile version