Site icon NTV Telugu

VIDEO: ఆస్తి వివాదంలో మైనర్ బాలికపై గుండాయిజం.. యూపీ ఘటన వైరల్..

Uttar Pradesh

Uttar Pradesh

VIDEO: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ గుండా మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆస్తి వివాదంలో బాలికపై రౌడీ దాడి చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు.

దీపికా తివారీ అనే మైనర్ అమ్మాయికి సంబంధించిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న గుండా, అమ్మాయి ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని గోమతి నగర్‌లో చోటుచేసుకుంది. తన మేనమామ ఇంట్లో ఉంటూ బాలిక ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతోంది.

Read Also: Trinamool Congress Leader: ‘‘ఇస్లాంని వ్యాప్తి చేయాలి’’.. తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

వైరల్ అవుతున్న వీడియోలో నిందితుడు కూర్చుని ఫోన్‌లో వేరే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇలా మాట్లాడే సమయంలో అమ్మాయి కలుగజేసుకోవడంతో, నిందితుడు ఆమెను చెంపపై పలుమార్లు కొట్టడం కనిపిస్తుంది. ఆమె మామ ఆస్తిని అక్రమం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు టీములను ఏర్పాటు చేశామని, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version