Uttar Pradesh: గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్తుల దాడి.. పోలీసుల రంగ ప్రవేశంతో..
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్థుల దాడి..
- రాత్రిపూట కార్లలో వచ్చి సర్వే చేస్తుండగా, దొంగలేమో అనే డౌట్ తో దాడి చేసిన స్థానికులు..
- గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌తో పాటు గ్రామస్థులను పీఎస్ కు తరలించిన స్థానిక పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్థులు దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రాత్రివేళ కార్లలో వచ్చి దొంగతనాలు చేస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి, పరిచయం లేని వాహనాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.. ఆగస్టు 28వ తేదీన గూగుల్ టీమ్ రోడ్డుపై మ్యాపింగ్ కోసం కెమెరా అమర్చిన వాహనంలో సర్వే చేస్తుండగా, అనుమానం వచ్చిన స్థానిక ప్రజలు వారిని అడ్డుకుని.. వారిపై కొంతమంది గ్రామస్థులు దాడి చేశారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, సర్వే టీమ్‌తో పాటు గ్రామస్థులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Also: Sunny Leone : సరోగసీ అనుభవాలు పంచుకున్న పొర్న్ బ్యూటీ..
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్ టీమ్ లీడర్ సందీప్ మాట్లాడుతూ.. గ్రామస్థులు మమ్మల్ని అనుమానంతో చుట్టుముట్టారు. మా డాక్యుమెంట్లు చూసి ఉంటే, మమ్మల్ని ఇలా కొట్టేవారు కాదు అని పేర్కొన్నారు. మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతోనే పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, పోలీసులు మాట్లాడుతూ.. గూగుల్ మ్యాప్స్ టీమ్ స్థానిక పోలీసులకు గానీ గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వకుండానే సర్వే ప్రారంభించింది.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా, ఈ ఘటనపై గూగుల్ టీమ్ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. గ్రామస్థులతో చర్చల అనంతరం వివాదం సర్దుమణిగింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!