Site icon NTV Telugu

కోచి తీరంలో ర‌హ‌స్య‌దీవి…

కేర‌ళ‌లోని కోచీ తీరంలో ఓ ర‌హ‌స్య‌దీవిని గూగుల్ మ్యాప్ గుర్తించింది.  స‌ముద్ర‌గ‌ర్భంలో ఈ దీవి ఉండ‌టంలో క‌నుగొనేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది.  గూగుల్ మ్యాప్ ఈ దీవిని గుర్తించ‌డంతో ప‌రిశోధ‌కులు ఈ దీవిపై దృష్టిసారించారు.  కోచి తీరానికి 7 కిలోమీట‌ర్ల దూరంలో ఈ దీవి ఉన్న‌ట్టు చెల్ల‌న‌మ్ క‌ర్షిక టూరిజం సంస్థ తెలిపింది.  తీరయెక్క అవ‌క్షేపం, కోత‌కు గురికావ‌డం వ‌ల‌న ఈ దీవి ఏర్ప‌డి ఉండ‌వ‌చ్చ‌ని టూరిజం సంస్థ తెలిపింది.  సుమారు 8 కిలోమీట‌ర్ల పొడ‌వు, 3.5 కిలోమీట‌ర్ల వెడ‌ల్పు క‌లిగిన ఈ దీవిపై ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని ఫిష‌రీస్ మంత్రిత్వ‌శాఖను ప్ర‌భుత్వం ఆదేశించింది.  

Exit mobile version