NTV Telugu Site icon

Google CEO Meets PM: ప్రధాని మోదీని కలిసిన సుందర్ పిచాయ్.. జీ-20కి మద్దతు

Sunder Pichai, Pm Modi

Sunder Pichai, Pm Modi

Google CEO Meets PM: భారత ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. సోమవారం ఇరువురు సమావేశం అయ్యారు. అందరికి ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్ కు మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇరువురి మధ్య జీ-20 సమావేశంపై చర్చ జరిగింది. ఈ నెల మొదట్లో భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతను తీసుకుంది. ‘‘గూగుల్ ఫర్ ఇండియా’’ ఈవెంట్ కు హాజరుకావడానికి సుందర్ పిచాయ్ ఇండియాకు వచ్చారు.

Read Also: FIFA World Cup Final: రికార్డ్ క్రియేట్ చేసిన గూగుల్..

వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 200 సమావేశాలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో G20 సదస్సు నిర్వహించనున్నారు. ఈ భేటీపై సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. భారత ప్రధానితో సమావేశం కావడంపై ధన్యవాదాలు తెలిపాడు. మీ నాయకత్వంలో సాంకేతిక మార్పు వేగవంతం కావడానికి స్పూర్తినిస్తోందని.. గూగుల్, ఇండియాల మధ్య బలమైన భాగస్వామ్య కొనసాగించడానికి అందరికీ పనిచేసే ఓపెన్, కనెక్ట్ ఇంటర్నెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశ జీ-20 అధ్యక్ష పదవికి మద్దతు ఇవ్వాలని ఎదురుచూస్తున్నా అని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. జీ 20 అనేది ప్రపంచంలో 20 ప్రధాన అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమి. ఈ ఏడాది ఇండోనేషియా జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇండోనేషియా నుంచి 2023కు గానూ జీ-20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా తీసుకుంది.

 

 

Show comments