NTV Telugu Site icon

DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపుకు క్యాబినెట్ ఆమోదం..

Da Hike

Da Hike

DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంపుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పెంపుతో 53 శాతం నుంచి 55 శాతానికి డీఏ పెరగనుంది. ఈ పెంపు జనవరి1, 2025 నుంచి వర్తిస్తుంది. మొత్తంగా ఉద్యోగులు జీతాలు పెరకబోతున్నాయి. చివరిసారిగా కేంద్రం జూలై 2024లో డీఏని పెంచింది. ఆ సమయంలో 50 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది.

Read Also: Salman Khan : సౌత్ ఇండియా ప్రేక్షకులు మా సినిమాలు చూడట్లేదుః సల్మాన్ ఖాన్

డియర్‌నెస్ అలవెన్స్ (DA) అనేది ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇచ్చే భత్యం. ఏడాదికి రెండుసార్లు డీఏను పెంచుతారు. పెరిగిన జీవన వ్యయాల కారణంగా జీతాలు సర్దుబాటు చేయడానికి ఉద్దేశించబడింది. ప్రతీ 10 ఏళ్లకు ఒకసారి పే కమిషన్ ప్రాథమిక జీతాలను నిర్ణయిస్తుండగా, ద్రవ్యోల్బణాన్ని అనుగుణంగా డీఏ కాలానుగుణంగా సర్దుబాటు చేస్తుంటారు.

డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు , పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. పారిశ్రామిక కార్మికుల కోసం అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక (AICPI-IW) డేటా ఆధారంగా DA రేట్లు నిర్ణయించబడతాయి. ఏదైనా సవరణపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం గత ఆరు నెలల గణాంకాలను అంచనా వేస్తుంది.