Site icon NTV Telugu

Delhi: జైన ఉత్సవంలో కంత్రీ దొంగ.. కోటి విలువైన బంగారు వస్తువులు అపహరణ

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో ఓ కంత్రీ దొంగ కోటికి పైగా విలువైన బంగారు కలశాలను ఎత్తుకెళ్లిపోయాడు. ఎవరికి అనుమానం రాకుండా పూజారి వేషంలో వచ్చి పాత్రలను ఎత్తుకెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ‌లో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: UK: యూకే చరిత్రలో సరికొత్త అధ్యయనం.. హోం కార్యదర్శిగా ముస్లిం మహిళ నియామకం

ఎర్రకోటలో జైన ఉత్సవం జరిగింది. భక్తులంతా ఉత్సవ సందడిలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన ఓ కంత్రీ దొంగ.. పూజారి వేషంలో వచ్చి రూ.1.5 కోట్ల విలువైన రెండు బంగారు కలశాలను ఎత్తుకెళ్లిపోయాడు. ఇతర పెద్ద వస్తువులను కూడా అపహరించుకునిపోయాడు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంంటామని హామీ ఇచ్చారు.

దొంగిలింపబడిన వస్తువుల్లో వజ్రాలు, పచ్చలు, కెంపులతో పొదిగిన 115 గ్రాముల చిన్న పరిమాణంలో ఉన్న వస్తువులు.. 760 గ్రాముల బరువున్న బంగారు వస్తువులు ఉన్నాయి. వీటిని జైన ఆచారాల ప్రకారంగా పవిత్రంగా చూస్తారు.

ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ

ఎర్రకోట ప్రాంగణంలోని పార్క్‌లో ఆగస్టు 15 నుంచి 10 రోజుల పాటు ‘దసలక్షణ్ మహాపర్వ్’ ఉత్సవం జరిగింది. దుండగుడు జైన పూజారి వేషంలో వచ్చి దొంగిలించాడు. నిర్వాహకులు.. ప్రముఖులను స్వాగతించడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. ఉత్సవ కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు వేదికపై వస్తువులు కనిపించలేదు. దీంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది.

Exit mobile version