కేటుగాళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నారు. కొత్తకొత్త ఐడియాలతో స్మగ్లింగ్ పాల్పడుతున్నారు. చివరికి కస్టమ్స్ అధికారులకు చిక్కి జైలు పాలవుతున్నారు. అయితే తాజాగా మరో వ్యక్తి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కొత్తగా ఆలోచించి.. చివరికి అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సౌదీఅరేబియా నుంచి ఓ వ్యక్తి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే అతడిపి అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనతో పాటు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లలో కూడా తనిఖీలు చేశారు.
అయితే తనవద్ద ఎలాంటి స్మగ్లింగ్ వస్తువు లేదని బుకాయించాడు. అంతలోనే తన చెప్పులను కూడా కస్టమ్స్ అధికారులు పరిశీలించగా అందులో కూడా ఏమీ దొరకలేదు. కానీ.. ఆ వ్యక్తి అరికాళ్లకు గమ్ అతికించి అరికాళ్లలలో బంగారం పేస్ట్‌ను అతికించాడు. దాన్ని గమనించిన కస్టమ్స్ అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. అంతేకాకుండా సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే సీజ్ చేసిన బంగారం విలువ 12 లక్షల వరకు ఉంటుందని, 240 గ్రాముల బరువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
