ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గత వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,800 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,880 కి చేరింది. బంగారం ధరలతో పాటు.. వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగి 72,100 కు చేరుకుంది.
మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు

gold