Site icon NTV Telugu

Gobi Manchuria : ఆ ప్రాంతంలో గోబీ మంచూరియ బంద్.. ఎందుకో తెలుసా?

Gobi Manchurian Recipe

Gobi Manchurian Recipe

ఈ మధ్య ఎక్కువ మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కన్నా నోటికి రుచిగా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు.. అందులో గోభి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచి అలాంటిది మరి.. ఇంట్లో చేసుకోవడం లేదా సమయం లేనప్పుడు బయటకు వెళ్లి ఎవరికి తగ్గట్లు వాళ్లు తింటారు.. చాలా మంది ఫేవరెట్​ ఫుడ్​పై నిషేధం విధించింది గోవాలోని ఓ పట్టణంలో గోబీని ఎక్కడా అమ్మకూడదని తేల్చేసింది.. ఎందుకు అలా చేసిందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గోబీ మంచూరియ లో కలర్ ఫుల్ గా కనిపించడం కోసం తయారీలో సింథెటిక్​ కలర్స్​ వాడుతున్నారన్న కారణంతోనే దానిపై నిషేధం విధించింది మపుసా మున్సిపల్​ కౌన్సిల్.. గోవాలో ఈ గోబీని బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది.. 2022లో జరిగిన వాస్కో సప్తా ఫెయిర్​ సమయంలోనూ ఇది నిషేధానికి గురైంది.. కేవలం ఆర్దర్స్ పాస్ మాత్రమే కాదు.. సిటీలో ఎక్కడైనా అమ్ముతున్నారా? లేదా అని అధికారులు ప్రత్యేకంగా రైడ్స్ చేసి చేశారు..

ఈ గోబీని నిషేదించడానికి కారణం కూడా లేకపోలేదు.. శుభ్రత కూడా ఒక కారణం అని తెలుస్తోంది.. ఈ మంచూరియాను 1970లో తొలిసారి తయారీ చేసినట్లు తెలుస్తుంది.. ముంబైకి చెందిన దిగ్గజ చైనీస్​ రెస్టారెంట్​ నెల్సన్​ వాంగ్​.. దీనిని రూపొందించి, క్రికెట్​ క్లబ్​ ఆఫ్​ ఇండియాకు సర్వ్​ చేసింది.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వంట ప్రాచుర్యం పొందింది.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు కూడా..

Exit mobile version