Site icon NTV Telugu

Kneeling goat: దేవుడి ముందు మోకరిల్లిన మేక.. ఎందుకో తెలుసా?

Kneeling Goat

Kneeling Goat

Kneeling goat:  జంతువులు కొన్నిసార్లు.. మనుషుల్లా ప్రవర్తిస్తాయని చెప్పాలి. సంజ్ఞలు చేయడంలో లేదా దేవుణ్ణి ప్రార్థించడంలో జంతువులు తరచుగా మనుషులను అనుసరిస్తాయి… ఇలాంటివి చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు అనే చెప్పాలి…  జంతువు దీన్ని ఎలా చేయగలదని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి ఇప్పుడు ఆలోచిస్తే ఇలాంటి వీడియో ఒకటి ట్విట్టర్ లో హల్ చల్ చేస్తుందనే చెప్పాలి.ఇటీవలి కాలంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మనిషి నిత్యం దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాడు. ప్రతి మనిషి తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో రకాల కోరికలు కోరుతున్నారనే చెప్పాలి. అయితే ఒక వ్యక్తి గుడికి వెళ్లి దేవుడిని మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రార్థించడం ఇప్పటివరకు మనం చాలాసార్లు చూశాం…. ఇక్కడ ఒక మేక శివుని ముందు మోకరిల్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Read also:Urvashi Rautela : హీరోయిన్ పై ఫ్యాన్స్ ఫైర్.. వెంటపడొద్దంటూ హెచ్చరికలు

అచ్చం అక్కడ చేస్తున్న వాళ్లలాగే ఆ శివాలయం గర్భాలయం ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఆనందేశ్వర్ ఆలయానికి భక్తులతో పాటు మేక కూడా వచ్చింది. గర్భగుడి ముందు మోకరిల్లి దేవుడిని ప్రార్థించింది. మేకను ఇలా చేయడం చూసి అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారనే చెప్పాలి. వెంటనే ఆ ఘటనను తమ మొబైల్‌ ఫోన్లలో బంధించారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారనే చెప్పాలి.

దేవుడి ముందు మోకరిల్లిన మేక వీడియో:

Exit mobile version