Site icon NTV Telugu

Goa CLP: గోవా సీఎల్పీ బీజేపీలో విలీనం.. ఆమోదం తెలిపిన స్పీకర్

Goa Congress

Goa Congress

Goa CLP: రాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ)ని అధికార బిజెపిలో విలీనానికి తాను అంగీకరించినట్లు గోవా అసెంబ్లీ స్పీకర్ రమేష్ తవాడ్కర్ గురువారం తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్పించిన లేఖను పరిశీలించగా.. వారికి కావాల్సిన సంఖ్యలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది బుధవారం బీజేపీలో చేరి, కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని తీర్మానం చేశారు. కాంగ్రెస్‌కు భారీ షాక్‌ ఇస్తూ బుధవారం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీనితో కాంగ్రెస్ బలం అసెంబ్లీలో మూడుకు పడిపోయింది.

Gujarat: ఎనిమిదేళ్ల కాపురం తర్వాత.. బిగ్ ట్విస్ట్.. ఆయన కాదు.. ఆమె..!

బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని వార్తలు వచ్చాయి. అందుకే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గవర్నర్‌ను కలిశారనే వార్తలు రాగా.. వాటిని సీఎం ఖండించారు. ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

Exit mobile version