Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Goa Cm Pramod Sawant To Write To Shah For Cbi Probe In Sonali Phogat Case

Sonali Phogat Case: సోనాలీ ఫోగాట్ కేసును సీబీఐకి అప్పగించండి.. కేంద్రాన్ని కోరిన గోవా సీఎం

Published Date :September 12, 2022 , 1:45 pm
By Mahesh Jakki
Sonali Phogat Case: సోనాలీ ఫోగాట్ కేసును సీబీఐకి అప్పగించండి.. కేంద్రాన్ని కోరిన గోవా సీఎం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sonali Phogat Case: హర్యానాలోని హిసార్ జిల్లాలో ఖాప్ మహాపంచాయత్ జరిగిన మరుసటి రోజు బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్యపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును కోరుతూ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ హత్య కేసును కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత సోనాలి ఫోగట్ కుటుంబం అదే డిమాండ్ చేస్తూ హర్యానా ముఖ్యమంత్రిని కలిశారు.

రాష్ట్ర పోలీసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, దర్యాప్తు చాలా బాగా జరుగుతోందని.. అయితే హర్యానాలోని ప్రజల నుండి పదేపదే డిమాండ్ చేసిన తర్వాత బదిలీ కోసం హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని సావంత్ చెప్పారు. గోవా పోలీసులు ఈ కేసులో “అద్భుతమైన దర్యాప్తు” చేశారని, కొన్ని కీలకమైన ఆధారాలు కూడా లభించాయని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పనాజీలో విలేకరులతో అన్నారు. కానీ హర్యానా ప్రజల నుంచి, సోనాలీ ఫోగాట్ కుమార్తె డిమాండ్ కారణంగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు వ్యక్తిగతంగా లేఖ రాస్తానన్నారు. ఆమె మరణించిన పరిస్థితులపై వివరాలను కోరుతూ, సోనాలీ ఫోగాట్ కుటుంబం, ముఖ్యంగా ఆమె చిన్న కుమార్తె, ఈ కేసుపై కేంద్ర ఏజెన్సీ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

NIA Raids: టెర్రర్ గ్రూపులతో లింకున్న గ్యాంగ్‌స్టర్ల అణచివేత.. భారీస్థాయిలో ఎన్‌ఐఏ దాడులు

గోవా టూర్‌కు వెళ్లిన ఆమె.. గత నెలలో ఆమె హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ.. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది హత్యనే విషయం నిర్ధారణ అయ్యింది. వ్యక్తిగత సిబ్బంది సుధీర్‌ సాంగ్వాన్‌, సుధీర్‌ అనుచరుడు సుఖ్విందర్‌లు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా పోలీస్‌ కస్టడీలో ఉన్నారు. సోనాలి ఫోగట్‌ హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ఆమె కుటుంబం సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తూ వస్తోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని, మత్తు పదార్థాలు ఇచ్చి మరీ అఘాయిత్యానికి పాల్పడి బ్లాక్‌ మెయిల్‌ చేశారంటూ కుటుంబ సభ్యులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి గోవా పోలీసులు ఇద్దరు ఎమ్మెల్యే ఫోగాట్ సహాయకులు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఆమె ఇద్దరు సహాయకులపై హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కంటెంట్ క్రియేటర్ అయిన సోనాలి ఫోగాట్ తన టిక్‌టాక్ వీడియోలతో ఖ్యాతిని పొందింది. 2006లో టీవీ యాంకర్‌గా రంగప్రవేశం చేసిన ఆమె రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • CBI
  • Central Bureau of Investigation
  • goa chief minister
  • Goa CM Pramod Sawant

తాజావార్తలు

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions