Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుందనే అభియోగాల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ సిఫారసులతో నిన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో మహువామోయిత్రా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ, బిలియనీర్ అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. ఇంతే కాకుండా ఆమె తన వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను పంచుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహువా మోయిత్రాపై ఎథిక్స్ కమిటీ విచారించి, ఆమెను బహిష్కరించింది.
Read Also: Purandeshwari: అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్.. పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే మహువా బహిష్కరణపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇది సంతోషకరమైన రోజు కాదు, బాధాకరమూన రోజు’’ అని అన్నారు. అవినీతి, జాతీయ భద్రత సమస్యపై ఒక ఎంపీని బహిష్కరించడం తనకు బాధ కలిగిస్తోందని, నిన్న సంతోషకరమైన రోజు కానది, విచారకరమైన రోజని అన్నారు. అయితే మహువా తన బహిష్కరణ తర్వాత ఎథిక్స్ కమిటీ, బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. ఎథిక్స్ కమిటీ అన్ని ఉల్లంఘటనకు పాల్పడిందని ఆరోపించారు, సాక్ష్యం లేకుండా తనను శిక్షించారని అన్నారు. దర్శన్ హీరానందానీ మౌకికంగా సాక్ష్యం చెప్పకుండా, ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించడాన్ని తప్పుపట్టారు.