Gen Z Travel Trend: కొత్త ట్రెండ్‌గా మారిన ‘రేజ్ బుకింగ్’.. కోపంలో ట్రిప్స్ ప్లాన్ చేస్తున్న యువత.!
- కొత్త ట్రెండ్‌గా మారిన ‘రేజ్ బుకింగ్’ అంటే ఏమిటి?
- జెన్-జీ & మిలీనియల్స్ ఎందుకు ఇష్టపడుతున్నారు?
- రీవెంజ్ ట్రావెల్ VS రేజ్ బుకింగ్
- కోపంలో బుక్ చేస్తే జాగ్రత్తలు అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మనం ఎంతో ప్రశాంతంగా కూర్చుని, సెలవుల కోసం ప్లాన్ చేసుకుని ట్రిప్స్ బుక్ చేసుకుంటాం. కానీ ‘రేజ్ బుకింగ్’ అనేది దీనికి పూర్తిగా భిన్నం. పని ఒత్తిడి, ఆఫీసులో బాస్ విసిగించడం లేదా జీవితంలో ఎదురయ్యే చిరాకుల వల్ల వచ్చే కోపాన్ని తగ్గించుకోవడానికి వెనుకాముందు ఆలోచించకుండా వెంటనే ఏదో ఒక ట్రిప్ బుక్ చేసుకోవడమే ఈ ట్రెండ్ సారాంశం.
అసలు ‘రేజ్ బుకింగ్’ అంటే ఏమిటి?
‘రేజ్’ (Rage) అంటే తీవ్రమైన కోపం. ఉద్యోగంలో విపరీతమైన పని భారం ఉన్నప్పుడు లేదా కెరీర్ పట్ల అసంతృప్తి కలిగినప్పుడు.. ఆ నిరాశ నుంచి బయటపడటానికి యువత వెంటనే ఫ్లైట్ టికెట్లు లేదా హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు. “ఇక నా వల్ల కాదు, నాకు బ్రేక్ కావాలి” అనే ఉద్దేశంతో తీసుకునే ఈ తక్షణ నిర్ణయాన్నే రేజ్ బుకింగ్ అని పిలుస్తారు. ఇది ఒక రకమైన ‘ఎమోషనల్ బుకింగ్’.
Also Read
- CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
జెన్-జీ , మిలీనియల్స్ ఎందుకు ఇష్టపడుతున్నారు?
ప్రస్తుత కాలంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం దీనికి ప్రధాన కారణం. నిరంతర పని ఒత్తిడి వల్ల కలిగే మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రయాణమే ఉత్తమ మార్గమని యువత భావిస్తున్నారు. ఏదైనా ట్రిప్ బుక్ చేసిన వెంటనే, మనసుకి ఒక రకమైన ఊరట లభిస్తుంది. ప్రయాణం ఇంకా మొదలవ్వకపోయినా, “నేను వెళ్తున్నాను” అనే ఆలోచనే వారికి సంతోషాన్నిస్తుంది. తమ వ్యక్తిగత జీవితం కంటే ఉద్యోగం గొప్పది కాదని నిరూపించుకోవడానికి కూడా చాలామంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రీవెంజ్ ట్రావెల్ వర్సెస్ రేజ్ బుకింగ్
కరోనా తర్వాత ‘రీవెంజ్ ట్రావెల్’ (Revenge Travel) అనే పదం పాపులర్ అయ్యింది. అంటే లాక్-డౌన్ వల్ల ఇంట్లోనే ఉండిపోయినందుకు ప్రతీకారంగా ఎక్కువ ప్రయాణాలు చేయడం. కానీ ‘రేజ్ బుకింగ్’ అనేది పూర్తిగా మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కోపం , నిరాశకు సంబంధించినది. రీవెంజ్ ట్రావెల్ సమయం గురించి అయితే, రేజ్ బుకింగ్ మానసిక స్థితి (Mood) గురించి.
జాగ్రత్తలు అవసరం!
కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా ఒక్కోసారి ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. ఆవేశంలో బడ్జెట్‌కు మించిన ట్రిప్స్ బుక్ చేసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి, బ్రేక్ తీసుకోవడం అవసరమే అయినా, అది మీ జేబుకు చిల్లు పడకుండా చూసుకోవడం ముఖ్యం.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!