Site icon NTV Telugu

Ravindranath-Gayatri: చిక్కుల్లో పన్నీరు సెల్వం కొడుకు.. మహిళ దెబ్బకు ప్రమాదంలో ఎంపీ పోస్టు

Mp Ravindranath

Mp Ravindranath

Gayatri Devi Allegations On MP Ravindranath: తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం కొడుకు రవీంద్రనాథ్ తాజాగా కొత్తు చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయన ఎంపీ పోస్టు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఓ సామాన్య మహిళ ఆయనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలే అందుకు కారణం. తాను అన్నగా భావించిన వ్యక్తి తనపై ఆశపడ్డాడని, సహకరించకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆ మహిళ కుండబద్దలు కొట్టింది. అతనిపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సైతం చేసింది. ఆ మహిళ పేరు గాయత్రి దేవి. తానిచ్చిన ఫిర్యాదులో ఆమె ఏం పేర్కొన్నదంటే..

Cab Driver Extorts: ఫోన్‌లో ‘ఎఫైర్’ మాటలు విన్నాడు.. మహిళని బెదిరించి 22 లక్షలు దోచేశాడు

2014లో ఒక పెళ్లి సమయంలో తన కుటుంబానికి, పన్నీరు సెల్వం ఫ్యామిలీతో పరిచయం ఏర్పడినట్టు ఆమె తెలిపింది. క్రమంగా తమ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, దాంతో అందరం ఒకే కుటుంబం తరహాలో మెలిగే వాళ్లమని చెప్పింది. పన్నీరు సెల్వం తనయుడు అయిన రవీంద్రనాథ్‌ను తాను సొంత అన్నయ్యలాగా భావించానని, ఆ విధంగా అతనితో మెలిగానని పేర్కొంది. అయితే.. గతేడాది చివరి నుంచి రవీంద్రనాథ్ తనని వేధించడం మొదలుపెట్టాడని ఆరోపించింది. ఆయన మిత్రుడు ఒకరు తనకు ఫోన్ చేసి.. ‘నువ్వంటే రవీంద్రనాథ్‌కి ఎంతో ఇష్టం, నువ్వు సహకరిస్తే రాణిలా ఉంటావ్, లేకపోతే చంపేస్తాం’ అని బెదిరించాడని వెల్లడించింది.

Karnataka : విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని మృతి చెందిన 8 నెలల చిన్నారి..

మొదట్లో తాను ఈ బెదిరింపును పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఒక రోజు రవీంద్రనాథ్ మద్యం మత్తులో తనకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడని, అది తనకు తీవ్ర ఆవేదనకు గురి చేసిందని గాయత్రి దేవి చెప్పింది. అక్కడి నుంచి వేధింపులు మరింతగా పెరిగాయని.. తనకు కంటి మీద కునుకు లేకుండా చేశారని పేర్కొంది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు బెదిరింపులు ఇంకా పెరిగిపోవడంతో.. తాను భయాందోళనలకు గురై, పోలీసుల్ని ఆశ్రయించానని ఆమె వివరించింది. మరి.. ఈ వివాదం మున్ముందు మరెన్ని పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Exit mobile version