NTV Telugu Site icon

Adani Son Engagement: గౌతమ్ అదానీ కొడుకు ఎంగేజ్మెంట్.. వధువు ఎవరంటే..

Gautam Adani's Son Jeet Adani Gets Engaged

Gautam Adani's Son Jeet Adani Gets Engaged

Gautam Adani’s son Jeet Adani gets engaged to Diva Jaimin Shah: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ ఎంగేజ్మెంట్ దివా జైమిన్ షాతో ఆదివారం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగి ఈ నిశ్చితార్థానికి కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. జీత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దివా ప్రముఖ వజ్రాల వ్యాపారి సి.దినేష్ & కో. ప్రైవేట్ లిమిటెడ్‌ యజమాని జైమిన్ షా కుమార్తె. ఈ కంపెనీ ముంబాయి, సూరత్ ప్రాంతాల్లో ఉంది.

Read Also: RSS: రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి..

జీత్ అదానీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుండి పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూపులో చేరారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. జీత్ అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా చీఫ్ గా వహిస్తున్నారు.

గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్, న్యాయ సంస్థ సిరిల్ అమర్ చంద్ మంగళదాస్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన సిరిల్ ష్రాఫ్ కుమార్తె పరిధి ష్రాప్ ను వివాహం చేసుకున్నాడు. కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా, అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇటీవల హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ షేర్లు పడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని గౌతమ్ అదానీ తెలిపారు.