NTV Telugu Site icon

Jeet Adani Wedding: మూడు ముళ్లతో ఒక్కటైన జీత్, దివా షా.. ఫొటోలు వైరల్

Gautamadani

Gautamadani

అదానీ కుమారుడు జీత్ అదానీ, దివా షా వివాహం ఘనంగా జరిగింది. అతిరథ మహరథుల సమక్షంలో అంతరంగ వైభవంగా పెళ్లి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్ అనే అదానీ టౌన్‌షిప్‌లో గుజరాతీ సంస్కృతి ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. జీత్ అదానీ… వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాను వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలను గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి.

‘‘సర్వశక్తిమంతుడైన దేవుని ఆశీర్వాదంతో జీత్ మరియు దివా ఈరోజు వివాహం అనే పవిత్రమైన బంధంతో ఒక్కటయ్యారు. అహ్మదాబాద్‌లో సాంప్రదాయ ఆచారాలు మరియు శుభ్ మంగళ్ భావ్‌తో ప్రియమైనవారి మధ్య వివాహం జరిగింది. ఇది చాలా ప్రైవేట్ కార్యక్రమం. కాబట్టి మేము శ్రేయోభిలాషులను ఆహ్వానించలేకపోయాము. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నా కుమార్తె దివా మరియు జీత్ కోసం మీ అందరి నుంచి నేను హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటున్నాను.’’ అని పారిశ్రామికవేత్త అదానీ ఎక్స్ ట్విట్టర్‌ పోస్ట్‌లో రాశారు.

గౌతమ్ అదానీ రూ. 10,000 కోట్లు విరాళంగా ఇచ్చారు. వివిధ సామాజిక కార్యక్రమాలకు ఇస్తున్నట్లు కుమారుడి వివాహం సందర్భంగా అదానీ ప్రకటన చేశారు. విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు ఉపయోగించినట్లు పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం 500 మంది వికలాంగ మహిళల వివాహానికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని కొత్త జంట కూడా ఇటీవల ప్రతిజ్ఞ చేసింది. వివాహానికి కొన్ని రోజుల ముందు జీత్ అదానీ ఈ చొరవ తీసుకున్నారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు. జీత్ అదానీ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో చదివారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం జీత్.. విమానాశ్రయాల వ్యాపారం, అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు.