మత్తు పదార్థాలు పట్టివేత అనే వార్తను మనం తరచుగా వింటూ ఉంటాము. వాహనాల్లోనో, లేదంటే ఇతర ప్రాంతాల్లోనో అధికారులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుంటారు. అయితే తాజాగా జైపూర్ అంతర్జాతీయ పోస్టాఫీసు లో గాంజా దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికా నుండి జైపూర్ వచ్చిన పార్శిల్ లో 1.5 కోట్ల విలువ చేసే 9 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బ్రాండెడ్ బట్టల పార్శిల్ లో గాంజా దాచి పెట్టారు కేటుగాళ్లు. విశ్వసనీయ సమాచారం మేరకు అమెరికా నుండి వచ్చిన పార్శిల్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన కస్టమ్స్ అధికారులు తరువాత దానిని గుర్తించగలిగారు.
Read also : క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి ప్రభాస్ సర్ప్రైజ్
అమెరికా నుండి వచ్చిన 9 బట్టల పార్శిల్స్ ను స్కానింగ్ చేసిన అధికారుల బృందం అందులో ఒకదానిలో 9 కేజీల గాంజా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానికి సంబంధించి ఇద్దరు గాంజా స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కస్టమ్స్ అధికారులు తరచుగా ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకుంటుండడంతో కేటుగాళ్లు రూటు మారుస్తున్నారు. రోజుకో కొత్త దారిని వెతుక్కుంటున్నారు.
