మోసం కేసులో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముక్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. ముక్తార్ అన్సారీ ఈ సంవత్సరం గుండెపోటుతో మరణించాడు. అయితే ఆయన ఆస్తులను గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద అధికారులు సీజ్ చేశారు. అయితే తండ్రి ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఉమర్ అన్సారీ కుట్రపన్నాడు. దీంతో న్యాయస్థానానికి నకిలీ పత్రాలను సమర్పించాడు. తప్పుడు పత్రాలు సమర్పించినట్లుగా ధర్మాసనం గుర్తించింది. కోర్టు ఆదేశాలతో ఆదివారం ఉమర్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాంగ్‌స్టర్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఘాజీపూర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని బందాలోని ఒక ఆస్పత్రిలో గుండెపోటుతో ముక్తార్ అన్సారీ మరణించాడు. గ్యాంగ్‌స్టర్‌కు చెందిన ఆస్తులను విడుదల చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే కుమారుడు ఉమర్ అన్సారీ అక్ర మార్గంలో పొందాలని ప్లాన్ చేశాడు. తల్లి అఫ్షాన్ అన్సారీకి చెందిన నకిలీ సంతకాలను కోర్టులో సమర్పించాడు. ప్రస్తుతం అఫ్షాన్ అన్సారీ పరారీలో ఉంది. ఆమె తలపై రూ. 50,000 రివార్డు ఉంది. అయితే ఉమర్ అన్సారీ సమర్పించిన పత్రాలు నకిలీవిగా కోర్టు గుర్తించింది. దీంతో పోలీసులు ఉమర్‌ను అరెస్ట్ చేశారు. ఉమర్ అన్సారీపై మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Tollywood : సినిమా షూటింగ్స్ బంద్.. ఈ భారీ సినిమాల పరిస్థితి ఏంటి?
