NTV Telugu Site icon

UP: పోలీసుల ఎన్‌కౌంటర్‌.. గ్యాంగ్‌స్టర్ హతం

Upencounter

Upencounter

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మంగేష్ యాదవ్ హతమయ్యాడు. అతడి తలపై రూ.1లక్ష రివార్డు ఉంది. ఆగస్టు 28న వారణాసిలోని తాథేరి బజార్‌లోని నగల దుకాణంలో రూ.1.5 కోట్లు విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. మరో నలుగురితో కలిసి ఈ చోరీకి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. గురువారం సుల్తాన్‌పూర్‌లో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మంగేష్ యాదవ్ చనిపోయాడు.

ఇది కూడా చదవండి: France: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నిక

గురువారం తెల్లవారుజామున పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడని అధికారులు తెలిపారు. ఆగస్టు 28న మంగేష్ యాదవ్‌తో సహా మరో నలుగురితో కలిసి దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు సచిన్, పుష్పేంద్ర, త్రిభువన్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిషిర్‌పూర్ పురైని గ్రామంలో తెల్లవారుజామున 3.30 గంటలకు ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యాదవ్ మరణించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Show comments