Site icon NTV Telugu

Char Dham Yatra: ముగింపు దశకు చార్‌ధామ్‌ యాత్ర.. ఈరోజు గంగోత్రి, రేపు యమునోత్రి మూసివేత

Ganga

Ganga

Char Dham Yatra: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్‌ధామ్‌ యాత్ర చివరి దశకు చేరుకుంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు క్లోజ్ చేయనుండగా.. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తారు. అలాగే, రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేస్తారు.

Read Also: Tyson Naidu : ‘టైసన్ నాయుడు’లుక్ రిలీజ్.. మరీ ఇంత రస్టిక్ గా ఉన్నావేం బెల్లంకొండ

అయితే, దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను స్టార్ట్ చేసినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ చెప్పారు. అనంతరం గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహిస్తూ శీతాకాలపు విడిదికి తీసుకువస్తామన్నారు. మరోవైపు యమునోత్రి ధామ్‌ తలుపులు మూసివేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత యమునా తల్లి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని దేవాలయానికి తీసుకురానున్నారు. ఈ యాత్రా కాలంలో శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21 వేల 752 మంది భక్తులు ఈ రెండు ధామాలను సందర్శించారు.

Exit mobile version