Australia: ఆస్ట్రేలియాలో 420 కిలోల గాంధీ విగ్రహం చోరీ..
- మెల్‌బోర్న్‌లో గాంధీ కాంస్య విగ్రహం చోరీ..
- రాత్రి సమయంలో ఎత్తుకెళ్లిన దుండగులు..
- విచారణ ప్రారంభించిన ఆస్ట్రేలియా పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాం చోరీకి గురైంది. గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ముందు ఏర్పాటు చేశారు. దీనిని దుండగులు దొంగతనం చేశారు. ఈ విగ్రహం బరువు సుమారు 420-426 కిలోలు ఉంటుంది. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) దీనిని బహుమతిగా అందించింది.
Also Read
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
ఆస్ట్రేలియన్ మీడియా ప్రకారం.. ఈ దొంగతనం సోమవారం అర్థరాత్రి 12.50 గంటల సమయంలో జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఒక వైట్ వ్యాన్‌లో వచ్చి, ముఖానికి ముసుగు కప్పుకుని, యాంగిల్ గ్రైండర్ సహాయంతో విగ్రహాన్ని పునాదుల నుంచి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో గాంధీ విగ్రహం పాదాల వద్ద కోసి ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడి ఇండియన్ కమ్యూనిటీ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై విక్టోరియా పోలీస్ నాక్స్‌క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. స్క్రాప్ మెటల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా కాంస్య విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ విగ్రహాన్ని 2021 నవంబర్ 12న అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రారంభించారు. ప్రారంభించిన 24 గంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తుల విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు విగ్రహమే చోరీకి గురైంది.
🚨🇮🇳🇦🇺 Mahatma Gandhi statue stolen from Indian community center in Melbourne, Australia
The statue was a gift from the Indian Council for Cultural Relations (ICCR), New Delhi, and was unveiled by former Australian Prime Minister Scott Morrison.
Police are investigating the… pic.twitter.com/eusqZSGDLz
— Sputnik India (@Sputnik_India) February 3, 2026
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!