Site icon NTV Telugu

Lok sabha: జీ రామ్.. జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. పత్రాలు చించేసిన విపక్ష సభ్యలు

Loksabha

Loksabha

జీ-రామ్-జీ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును అధికార పార్టీ ఆమోదించింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చింది. కొత్త పేరు జీ-రామ్-జీ పేరుతో బిల్లు ఆమోదించింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు ప్రతులను చించేసి నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి: India-Oman: భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం.. ఇదొక మైలురాయి అన్న మోడీ

జీ రామ్ జీ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్ష సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని చట్టంపై సుదీర్ఘంగా చర్చించామని అనగానే.. విపక్ష సభ్యులంతా పత్రాలు చించేసి విసిరేశారు. మొత్తానికి గందరగోళం మధ్యే బిల్లు ఆమోదం పొందేసింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా విపక్షాలు వ్యతిరేకించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Nitish Kumar: క్షమాపణ చెప్పు లేదంటే చంపేస్తా.. హిజాబ్‌పై నితీష్‌కు పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ వార్నింగ్

Exit mobile version