G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- కర్ణాటకలో బుధవారం ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం
- పరమేశ్వరకు లక్కీ ఛాన్స్!
- కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, దళిత నాయకుడు జి.పరమేశ్వరకు లక్కీ ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది. రేపు ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో పరమేశ్వరకు డిప్యూటీ సీఎం పోస్ట్ దక్కబోతున్నట్లుగా వర్గాలు చెబుతున్నాయి. డీకే.శివకుమార్ ముఖ్యమంత్రిగా… పలువురు డిప్యూటీ సీఎం పోస్ట్‌లు ఉంటాయని ప్రచారం జరిగినా.. చివరికి పరమేశ్వర ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని అధిష్టానం తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పరమేశ్వర ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. అయితే మరోవైపు మరికొందరు నేతలు ఒకటి కంటే ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను నియమించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ ప్రస్తుతం పరమేశ్వర పేరుపైనే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో జరిగిన సమావేశాల్లో కొత్త మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 12 మంది మంత్రుల ఎంపిక పూర్తైనట్లు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి నియామకం, రాజ్యసభ, శాసన మండలి స్థానాల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
కొత్త మంత్రివర్గంలో డీకే శివకుమార్‌తో పాటు కనీసం 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రుల జాబితాపై తుది ఆమోదం కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలోనే ఇవ్వనుంది. ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో మరో కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేసీ. వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా తదితర సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
మరోవైపు డీకే శివకుమార్ తన రాజకీయ ప్రస్థానంలో గాంధీ కుటుంబం పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ తనలోని సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించి ప్రోత్సహించారని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆయన ప్రోత్సాహమే ప్రజాసేవలో మరింత ముందుకు సాగేందుకు తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్లు పూర్తైన తర్వాత నాయకత్వ మార్పు జరుగుతోంది. గత కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. చివరకు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఇప్పుడు పరమేశ్వరకు డిప్యూటీ సీఎం పదవి దక్కనున్నట్లు వార్తలు రావడంతో కొత్త ప్రభుత్వంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!