అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ కేసులో పోలీసులకు కీలక రిపోర్టు చిక్కింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో దర్శన్ దుస్తులపై ఉన్న రక్తపు మరకలు బాధితుడి దుస్తులపై ఉన్నవాటితో సరిపోలినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసు ఓ కీలక దశకు రాబోతుంది. ప్రస్తుతం దర్శన్, పవిత్ర గౌడతో సహా మరో 16 మంది జైల్లో ఉన్నారు. ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది.
ఇది కూడా చదవండి: Bangladesh: నోబెల్ విజేత యూనస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం.. రేపే ప్రమాణస్వీకారం
రేణుకాస్వామి హత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు కొత్త సాక్ష్యంగా మారనుంది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో దర్శన్ దుస్తులపై ఉన్న మరకలు రేణుకాస్వామి రక్తమేనని తేలింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరగబోతుంది. బెంగళూరులో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని దర్శన్, పవిత్రగౌడ్ హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో దర్శన్ నివాసం నుంచి బ్లూ జీన్స్, నలుపు రౌండ్-నెక్ షర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపారు. వస్ర్తాలపై ఉన్న రక్తపు మరకలు రేణుకాస్వామిదేనని తాజా నివేదిక ద్వారా నిర్ధారణ అయింది.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ఇదిరా క్రేజ్ అంటే.. కల్కి కోసం హైదారాబాద్ వచ్చిన జపనీయులు
అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రమేయం ప్రత్యక్షంగా ఉందని పోలీసులు తాజాగా నిర్ధారించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును ఇందుకు సాక్ష్యంగా న్యాయస్థానంలో సమర్పించనున్నారు. పోలీసులకు ఇది బలమైన సాక్ష్యంగా ఉండబోతుంది. ఇప్పటికే చాలా రోజులుగా నిందితులంతా జైల్లో మగ్గుతున్నారు. బెయిల్ కూడా దొరకడం లేదు. ఇక తాజా రిపోర్టుతో మరిన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Cyber Crime: సైబర్ మోసంలో ఇరుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. 40 వేలు స్వాహా..