Kalita Majhi: ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ.. ఈమె ఎవరు?
- ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ
- ఔష్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం
- తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల తేడాతో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సోమవారం (మే 4, 2026) ప్రకటించిన ఫలితాల్లో, భారతీయ జనతా పార్టీ 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుంది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 80 స్థానాలకే పరిమితమైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ సాధించిన విజయం గురించి దేశ నలువైపులా చర్చ జరుగుతోంది. ఆమె ఎవరో కాదు కుటుంబ పోషణ కోసం ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసే కలితా మాజీ. ఆమె ఔష్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు.
ఔష్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కలితా మాజీని నామినేట్ చేయగా, ప్రజలు ఆమెపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఔష్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం బోల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగం. పుర్బా బర్ధమాన్ జిల్లాలోని ఔష్‌గ్రామ్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో కమలం వికసించడం ఇదే తొలిసారి. బీజేపీ అభ్యర్థి కలితా మాఝీ తన ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కలితా మాజీ 107,692 ఓట్లు సాధించి, టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్‌ను 12,535 ఓట్ల తేడాతో ఓడించారు. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
కలితా మాజీ ఎవరు?
కలితా మాజీ గుస్కారా మున్సిపాలిటీ నివాసి. రాజకీయాల్లోకి రాకముందు మూడు నాలుగు ఇళ్లలో పనిమనిషిగా పనిచేశారు. క్షేత్రస్థాయిలో ఆమెకున్న సంబంధాలు ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని చర్చనీయాంశం చేశాయి. ఆమె నెలకు సుమారు మూడు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తూ, ఆ ఆదాయంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నారు.
గుస్కారా మున్సిపాలిటీలోని 3వ వార్డు, మఝ్‌పుకుర్ పార్ నివాసి అయిన కలితా, తన భర్త సుబ్రతా మాజీతో కలిసి నివసిస్తున్నారు. విద్యా వ్యవస్థ అవినీతితో నిండిపోయిందని మాజీ అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. “భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది పాఠశాలలే కాబట్టి, నేను వాటిపై దృష్టి పెడతాను. రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తాను,” అని ఆమె తెలిపారు.
కలితా మాజీ గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే, ఆమె తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అభేదానంద థండర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ ఆమెను 2026 అసెంబ్లీ ఎన్నికలకు తిరిగి నామినేట్ చేసింది. ఈ నిర్ణయం, కలితాకు స్థానికంగా ఉన్న పలుకుబడిపై పార్టీకి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
BJP Bengal candidate Kalita Majhi, who works as a domestic worker in 4 households and earns ₹2,500 a month, wins from the Ausgram constituency. This is the power of the BJP, where even the most humble citizen can rise and script a truly inspiring journey. pic.twitter.com/LVI4V9xSFU
— P C Mohan (@PCMohanMP) May 4, 2026
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!