cultivate ganja using LED lights: సాధారణంగా ఏ మొక్క అయిన సూర్యకాంతి సహాయంతో పెరుగుతుంది. కానీ ఈ కేటుగాళ్లు మాత్రం ఏకంగా గంజాయిని ఎల్ఈడీ లైట్ల సాయంతో పెంచారు. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. నలుగురు వ్యక్తులు అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఏకంగా కృత్రిమంగా గంజాయిని సాగు చేశారు. సహజ సూర్యకాంతిని ఎల్ఈడీ లైట్లలో భర్తీ చేశారు. దీన్ని పెంచడానికి ప్రత్యేకంగా ఓ ఎయిర్ కండీషనర్ ను వాతావరణ నియంత్రణ కోసం ఉపయోగించారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఈ సెటప్ అంతా చూసి అవాక్కవ్వడం పోలీసుల వంతైంది.
Read Also: Great Father: బిడ్డకు సాయం చేసినా తప్పేనా సారు.. జర సోచాయించుర్రి
పూర్తి వివరాల్లోకి వెళ్లితే చెన్నైకి చెందిన నలుగురు శక్తివేల్, శ్యామ్ సుందర్, శ్రీకాంత్, నరేంద్ర కుమార్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టాలు చవిచూశారు. దీంతో డ్రగ్స్ దందాను మార్గంగా ఎంచుకున్నారు. ఏకంగా గంజాయి పంటనే అపార్ట్మెంట్ లో సాగు చేశారు. ఇంటర్నెట్ నుంచి వీడియోలు చూసి ఈ తరహా గంజాయి సాగును నేర్చుకున్నారు. ఈ ముఠా గంజాయితో పాటు నార్కోటిక్ స్టాంపులను కూడా విక్రయిస్తున్నారు. వీరి దగ్గర నుంచి 3 కిలోల గంజాయి, ఎల్ఎస్డీ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందుతులను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నిందితులను నమ్మించేందుకు పోలీసులు క్లయింట్స్ గా నటించారు. నార్త్ బీచ్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ ప్రత్యేక పోలీస్ బృందం ఇలా మారు వేషాలతో నిందితులను నమ్మించి గంజాయి ఉన్న ప్లాట్ కు వెళ్లారు. దీంతో నిందుతుల గుట్టు తెలిసిపోయింది.