NTV Telugu Site icon

Shaktikanta Das: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ నియామకం..

Shaktikanta Das

Shaktikanta Das

Shaktikanta Das: ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌ని ప్రభుత్వం శనివారం నియమించింది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుందని క్యాబినెట్ నియామకాల కమిటీ ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఆయన పదవీ కాలం ప్రధాని పదవీ కాలంతో సమానంగా ఉంటుంది లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రస్తుతం ప్రధానికి మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2019, సెప్టెంబర్ 11 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఇప్పుడు శక్తికాంత దాస్ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.