Site icon NTV Telugu

Achuthanandan: కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత

Achuthanandan

Achuthanandan

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమ దిగ్గజం వీఎస్.అచ్చుతానందన్ (101) తుదిశ్వాస విడిచారు. సోమవారం తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి: Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ సరికొత్త కుట్ర! ఆ పీఠంపైనే కన్నేశారా?

2019లో స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి ప్రజా జీవితం నుంచి వైదొలిగారు. ఆనాటి నుంచి తిరువనంతపురంలోని తన కుమారుడు అరుణ్ కుమార్ నివాసంలోనే జీవితాన్ని గడిపారు. కేరళ కమ్యూనిస్ట్ ఉద్యమానికి అచ్చుతానందన్ ఇనుప దవడలాంటి వారు. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్ట్ నేత. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నేతగా గుర్తింపు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక మందికి ఆదర్శంగా నిలిచారు.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియా కథనాలపై రామ్మోహన్ నాయుడు ఏం తేల్చారంటే..!

1923లో అలప్పుజలోని పున్నప్రలో వ్యవసాయ కార్మికులు కుటుంబంలో అచ్చుతానందన్ జన్మించారు. జీవితంలో అనేక ఒడుదుడుకులు, కష్టాలు అనుభవించారు. పేదరికం కారణంగా వ్యక్తిగతం అనేక ఇబ్బందులు పడ్డారు. అచ్చుతానందన్ చిన్నతనలంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 16 ఏళ్ల వయసులో ప్రముఖ కమ్యూనిస్ట్ నేత పి.కృష్ణ పిళ్లై సలహాతో స్వాతంత్ర్య ఉద్యమంలోకి అడుగుపెట్టారు. కృష్ణ పిళ్లైను గురువుగా భావిస్తారు.

ఇది కూడా చదవండి: Sonam Raghuvanshi: జైల్లో నెలరోజులు పూర్తి చేసుకున్న సోనమ్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

1964లో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ మండలిని విడిచిపెట్టి.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా మరారు. ఇక ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం జైల్లో అచ్చుతానందన్‌ను జైల్లో పెట్టింది. అచ్యుతానందన్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఎప్పుడూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవారు కాదు. 2009లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గాన్ని ధిక్కరించినందుకు సీపీఐ(ఎం) ఆయనను పార్టీ పొలిట్ బ్యూరో నుంచి బహిష్కరించింది.

Exit mobile version