Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇవాళ (ఆగస్టు 5న) మధ్యాహ్నం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హస్పటల్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాసి విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇటీవల ఆయన నివాసాల్లో సోదాలు జరిపి, సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సత్యపాల్ మాలిక్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
Read Also: Telangana : ఇరిగేషన్ శాఖలో ఎనిమిది మందికి చీఫ్ ఇంజనీర్ పదోన్నతులు
అయితే, ఆగస్టు 23, 2018 నుంచి అక్టోబర్ 30, 2019 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ పవర్ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ గవర్నర్ సత్యపాల్ పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయగా.. ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా ఆయన నివాసాల్లో తనిఖీలు జరిపిన సీబీఐ.. ఆయనతో పాటు మరో ఐదుగురి పేర్లను ఛార్జిషీటులో ప్రస్తావించింది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మాలిక్.. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నాను.. ఎవరితో మాట్లాడే పరిస్థితిలో లేనని తెలియజేశారు. అనేక మంది శ్రేయోభిలాషుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. వాళ్లతో కూడా మాట్లాడలేకపోతున్నానని అని తెలిపారు.
