కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో ఎక్కువ మందిని కరోనా అతలాకుతలం చేసింది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడ్డారు.. అందులో ఎంతోమంది ప్రాణాలు కూడా వదిలారు.. తాజాగా, లెజెండ్ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన మిల్ఖా సింగ్ కోవిడ్ బారినపడ్డారు.. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది.. ఆయన వయస్సు 91 ఏళ్లు..అయితే, ఆయన పరిస్థితి నిలకడగానే ఉండడంతో.. చండీగఢ్ సెక్టార్ 8లోని తన నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు మిల్కా సింగ్.. రాత్రి నుంచి తీవ్రం జ్వరంతో బాధపడుతున్నారని.. ఇటీవల ఇంట్లోని సహాయకుల్లో ఒకరు పాజిటివ్‌గా తేలిందని.. దీంతో అనుమానంతో టెస్ట్ చేయిస్తూ.. ఆయనకు కూడా పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు మిల్ఖా సింగ్ భార్య నిర్మల్ కౌర్.. ఇక, ఆయన కూతురు మోనా మిల్ఖా సింగ్.. యూఎస్‌లో డాక్టర్ కావడంతో ఎప్పటికప్పుడు వీడియో కాల్ ద్వారా సూచనలు చేస్తున్నారు.
మిల్ఖా సింగ్‌కు కరోనా
Milkha Singh