NTV Telugu Site icon

Karnataka sex scandal: తన తల్లిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించాడు.. హెచ్‌డీ రేవణ్ణపై సంచలన ఆరోపణలు..

Karnataka Sex Scandal

Karnataka Sex Scandal

Karnataka sex scandal: కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌కి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి పట్టు ఉన్న హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. దీని తర్వాత రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి, జేడీయూ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. దీనిపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం నుంచి జర్మనీ వెళ్లారు. అతడిపై కర్ణాటక పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా హెచ్‌డీ రేవణ్ణపై సంచలన ఆరోపణలు నమోదయ్యాయి. తన తల్లిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ కొడుకు 20 ఏళ్ల యువకుడు ఆరోపించాడు. దీంతో అతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. గత నెలలో తల్లిపై లైంగిక వేధింపుల వీడియో వైరల్‌గా మారింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి హెచ్‌డీ రాజు, అతని తల్లి రేవణ్ణ ఫామ్‌హౌజులో పని చేస్తున్నారు. అయితే, ఈ కేసులో హెచ్‌డీ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోరారు.

Read Also: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..

తన తల్లి ఏప్రిల్ 29 నుంచి తప్పిపోయిందని ఆరోపిస్తూ హెచ్‌డీ రాజు కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మే 2న ఫిర్యాదు చేశారు. ఆమె కనిపించకుండా పోయిన తర్వాత నుంచి ఆమెని లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను, తన తల్లి రేవణ్ణ ఫామ్ హౌజులో ఆరేళ్లుగా పనిచేస్తున్నామని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మూడేళ్ల క్రితం ఆమె అక్కడ పనిచేయడం మానేసింది. ఏప్రిల్ 26న రెండో దశ లోక్‌‌సభ ఎన్నికలకు 3-4 రోజుల ముందు తమకు తెలిసిన వ్యక్తి తమ ఇంటికి వచ్చి, రేవణ్ణ భార్య భవానీ తన తల్లిని ఏదో పని నిమిత్తం పిలిచిందని రాజు పేర్కొన్నాడు.

ఏప్రిల్ 26న సతీష్ అనే వ్యక్తి తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకువచ్చానడి, అయితే, పోలీసలుు తమ ఇంటికి వస్తే తల్లితో కలిసి పారిపోవాలని సతీష్ రాజుతో చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో సతీస్ తమ నివాసానికి వచ్చి తన తల్లిని తీసుకువాలని రేవణ్ణ ఆదేశించాడని చెప్పి బలవంతంగా తీసుకెళ్లినట్లు రాజు చెప్పాడు. మే 1న తన తల్లిని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ అయిందని, ఈ విషయం తన స్నేహితుల ద్వారా తెలిసిందని రాజు చెప్పారు. ఆ వీడియోలో తన తల్లి కాళ్లను కట్టివేసి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు కనిపించిందని చెప్పారు. అదే రోజు తన తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు సతీష్ కి ఫోన్ చేస్తే ఆమెపై కేసు నమోదైందని, ఆమెకు బెయిల్ కావాలని చెప్పాడని రాజు చెప్పారు. గతంలో రేవణ్ణతో జరిగి గొడవపై మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆమె కర్రతో ఉన్న ఫోటో బయటపడినట్లు సతీష్ చెప్పాడు. దీంతో రాజు తన తల్లిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానించి పోలీసుల్ని ఆశ్రయించాడు. తన తల్లిని కొనుగొనాలని ఆయన కోరాడు.