NTV Telugu Site icon

Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత..

Haryana Ex Cm

Haryana Ex Cm

Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో ఈ రోజు (డిసెంబర్ 20) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన 1989 నుంచి 2005 వరకు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, దేశానికి 6వ ఉప ప్రధానిగా పని చేసిన చౌదరి దేవి లాల్ కుమారుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా. 1935లో ఈయన జన్మించారు. 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు.

Read Also: Australia Squad Announcement: చివరి 2 టెస్టులకు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ ను మార్చేసిన టీం మేనేజ్‌మెంట్‌

అయితే, హర్యానాకు 8వ ముఖ్యమంత్రిగా ఓం ప్రకాశ్ చౌతాలా సేవలందించారు. హర్యానా అసెంబ్లీకి ఏడుసార్లు ఆయన ఎన్నికైయ్యారు. ఇక, హర్యానా సీఎంగా ఎనలేని కీర్త ప్రతిష్టలను ఓం ప్రకాష్‌ చౌతాలా సంపాదించుకున్నారు. కానీ, రిక్రూట్‌మెంట్ కుంభకోణంతో పాటు పలు కేసుల్లో జైలు జీవితాన్ని కూడా ఆయన గడిపారు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన చౌతాలా భారత రాజకీయాలలో తనదై స్థానం సంపాదించుకున్నారు.