NTV Telugu Site icon

PM Modi: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా సంజయ్ మిశ్రా నియామకం

Sanjaymishra

Sanjaymishra

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా మాజీ ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. సంజయ్ మిశ్రా ఈఏసీ-పీఎంలో పూర్తి సభ్యుడిగా ఉండనున్నారు. సంజయ్ మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) రిటైర్డ్ అధికారి. ఆర్థిక నిపుణుడు. అనేక ఉన్నత స్థాయి కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఈడీ చీఫ్‌గా ఆయన పదవీకాలం నవంబర్ 18, 2023 వరకు రెండుసార్లు పొడిగించబడింది.

ఇక 2025, మార్చి 25(మంగళవారం) అర్థరాత్రి ఉత్తర్వులో మాజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM)లో పూర్తి సమయం సభ్యునిగా కార్యదర్శి హోదాలో నియమించడానికి ఆమోదం తెలిపింది. EAC-PM అనేది ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆర్థిక మరియు సంబంధిత అంశాలపై సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన ఒక స్వతంత్ర సంస్థ.

ఇది కూడా చదవండి: Minister Ponguleti: ధరణి పోర్టల్ బాగుందా లేదా అనేది ఎన్నికల్లో ప్రజల తీర్పుతో స్పష్టమైంది..

మిశ్రా ఉత్తరప్రదేశ్ వాసి. నవంబర్ 19, 2018న రెండు సంవత్సరాల పదవీకాలానికి ఈడీ చీఫ్‌గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2023 వరకు రెండుసార్లు పదవీకాలం పొడిగించబడింది. అంతకముందు ఢిల్లీలో ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్‌గా నియమితులయ్యారు.

మిశ్రా నేతృత్వంలో హై ప్రొఫైల్ కేసులు నడిచాయి. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, భర్త రాబర్ట్ వాద్రాపై దర్యాప్తు సాగించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఫరూక్ అబ్దుల్లా మరియు ఒమర్ అబ్దుల్లాపై చర్యలు ప్రారంభించింది. ఆయన పదవీకాలంలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ మరియు ఆయుధ డీలర్ సంజయ్ భండారి వంటి పరారీలో ఉన్న నిందితులను అప్పగించడానికి ఈడీ ఆమోదం పొందింది. మిశ్రా నాయకత్వంలో యెస్ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాణా కపూర్ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ-సీఈవో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ వంటి మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కూడా ఈడీ అరెస్టు చేసింది.

ఇది కూడా చదవండి: Suhasini : నాకు ఆరేళ్ల నుంచే ఆ జబ్బు ఉంది.. నటి షాకింగ్ కామెంట్స్