Delhi Excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారం ప్రకంపనలు సృషిస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలుగు ఐఏఎస్ అధికారి అరవ గోపికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీ లైసెన్సుల వ్యవహారంలో గోపికృష్ణపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మనీష్ సిసోడియా, గోపికృష్ణతో పాటుగా 13 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఐఏఎస్ అధికారి గోపికృష్ణతో పాటు పలువురు అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 11 మంది అధికారులు అక్రమాలకు పాల్పడినట్టుగా కేంద్రప్రభుత్వం గుర్తించింది.
Mamata Benerjee: దుర్గాపూజ కోసం పూజా కమిటీలకు రూ. 60 వేల గ్రాంట్
మద్యం స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది. దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు