NTV Telugu Site icon

Narayana Swamy: లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై రాజకీయాలు చేయాలి

Narayana Swamy

Narayana Swamy

Narayana Swamy: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు రోజువారీ రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించే ముందు పదవీ విరమణ చేయాలని అన్నారు. పార్టీ రాజకీయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యానించడం తగదన్నారు. ‘రోజువారీ రాజకీయ పరిణామాలపై గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు వ్యాఖ్యానించకూడదు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను తమిళిసై విమర్శించారని… రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై రాజకీయాలు చేయాలని ఆయన అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు చేయకూడదంటూ ఆయన ధ్వజమెత్తారు.

పాదయాత్ర చేయడానికి గాంధీ హఠాత్తుగా నిద్ర నుండి మేల్కొన్నారని డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ఆమె తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు మాత్రమే కలిగి ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు తనను పట్టించుకోకపోవడంతో తమిళిసై ఎక్కువ సమయం పుదుచ్చేరిలోనే గడుపుతున్నట్లు సమాచారం.

Manickam Tagore : అందరిని కంట్రోల్ లో పెట్టాల్సిన ఆయనే నోరు పారేసుకుంటున్నారా.?

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజం, గంజాయి రవాణా పెరిగిపోయాయని నారాయణస్వామి ఆరోపించారు. . ఫ్రాన్స్‌లో నివసిస్తున్న పుదుచ్చేరి మూలానికి చెందిన ప్రజలు ఇటీవల చేపట్టిన నిరసనతో భూకబ్జాలు పెరుగుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పుదుచ్చేరిలో ఫ్రెంచ్ పౌరులకు చెందిన ఇళ్లను సామాజిక వ్యతిరేక శక్తులు టార్గెట్ చేయడం ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఫ్రెంచ్ పౌరుల ఆస్తులను లాక్కునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. భూకబ్జాపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకునేలా పోలీసులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. డిస్టిలరీలను ప్రారంభించేందుకు కొత్త అనుమతులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.