Site icon NTV Telugu

MR. Srinivasan: తుది శ్వాస విడిచిన మాజీ అణుశాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాస‌న్

Mr Srinivasan

Mr Srinivasan

MR. Srinivasan: మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎన‌ర్జీ క‌మీష‌న్ మాజీ చైర్మెన్ మాలూరు రామ‌స్వామి శ్రీనివాస‌న్‌ ఈరోజు ఉదయం తుది శ్యాస విడిచారు. ఆయ‌న‌కు భార్య, కుమార్తె ఉన్నారు. స్వదేశీ అణ్వాయుధ కార్యక్రమ రూపకల్పనలో డాక్టర్ హోమీ బాబాతో కలిసి ఎంఆర్ శ్రీనివాసన్ పని చేశారు. ప్రతీష్టాత్మక పద్మ విభూష‌న్ అవార్డును అందుకున్నారు. శ్రీనివాస‌న్ మృతి ప‌ట్ల తమిళనాడు ప్రభుత్వం నివాళి ఆర్పించింది. ఇక, త‌మిళ‌నాడులోని ఉద‌గ‌మండ‌ళం జిల్లా కలెక్టర్ లక్ష్మీ భ‌వ్య త‌న్నీరు పుష్పాంజ‌లి ఘ‌టించారు.

Read Also: UK Professor: భారత వ్యతిరేక కార్యకలాపాలతో విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..

అయితే, ఎంఆర్ శ్రీనివాసన్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక కీలక పదవులను నిర్వహించారు. 1959లో భారతదేశపు మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత 1967లో మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం చీఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 1974లో ఆయన DAEలోని పవర్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగానికి డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత 1984లో అణు విద్యుత్ బోర్డు ఛైర్మన్‌గా నియమించబడ్డారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అణు విద్యుత్ ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు కార్యకలాపాలను స్వయంగా ఆయన పర్యవేక్షించారు.

Exit mobile version