Site icon NTV Telugu

Kerala: పాలస్తీనా అనుకూల బోర్డుల్ని తొలగించిన విదేశీ టూరిస్ట్.. కొచ్చిలో వివాదం..

Kochi

Kochi

Kerala: కేరళలో విదేశీ మహిళ పాలస్తీనా అనుకూల బోర్డులను తొలగించడం వివాదాస్పదంగా మారింది. కొచ్చిలో పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న బోర్డులను చించేసింది. ఇద్దరు విదేశీ మహిళా టూరిస్టులు కొచ్చి నగరంలో బోర్డులను ధ్వంసం చేశారు. ఇది యూదు ప్రజలకు అవమానకరంగా ఉందని మహిళలు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఏప్రిల్ 15న ఇద్దరు విదేశీ మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశీ టూరిస్టులను ఆస్ట్రేలియా దేశానికి చెందినవారిగా గుర్తించారు.

Read Also: Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన.. 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిపై కీలక ప్రకటన..

వీరితో స్థానికలు వాగ్వాదానికి దిగడం వీడియోలో కనిపించింది. ‘‘మీరు వీటిని ధ్వంసం చేశారు అని స్థానికుడు ఒకరు మాట్లాడటం వినవచ్చు. చెత్తాచెదారాన్ని తొలగించాలని కోరారు. ’’ అయితే, ఆ మహిళ తాను యూదుల కోసం చేశానని, మీరు దుష్ప్రచారం, అబద్దాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది. మీకు బ్యానర్లలో ఏదైనా సమస్య ఉంటే ఇలా ధ్వంసం చేయకుండా ఫిర్యాదు చేయాల్సిందని స్థానికులు కోరారు. ‘‘అయితే వారు దాన్ని తీసేయరు, ఇది మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోంది, మీరు తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారు’’ అని విదేశీ టూరిస్టులు అన్నారు.

హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు అందరూ ఉన్నారు, ఇది భారతదేశం అని ఓ వ్యక్తి చెప్పడం వినవచ్చు. అయితే, దీని సమాధానంగా ‘‘ యూదు ప్రజలు ఇక్కడ లేరు, కానీ మీరు వారి నుంచి డబ్బు సంపాదిస్తారు’’ అని విదేశీ మహిళ చెప్పడం వినవచ్చు. ఈ బోర్డులను స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version