NTV Telugu Site icon

Ford: ఫోర్డ్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..!

Ford

Ford

Ford: అమెరికన్ ఆటో మేకర్ దిగ్గజం ఫోర్డ్ ఇండియాకి తిరిగి రాబోతోంది. ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలోని తమిళనాడులో ఎగుమతుల కోసం తన తయారీ ప్లాంట్‌ని పున: ప్రారంభించాలని యోచిస్తోంది. మూడేళ్ల క్రితం దేశంలో ఇతర కార్ తయారీ సంస్థలతో పోటీని తట్టుకోలేక ఇండియా నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించే అవకాశం ఉందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఎగుమతుల కోసం తమిళనాడు రాష్ట్రంలో తయారీని పున: ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫోర్డ్ లేఖను కూడా సమర్పించారు.

Read Also: Yuzvendra Chahal: విధ్వంసం సృష్టించిన యుజ్వేంద్ర చాహల్..

ఫోర్డ్ 2021లో భారతదేశంలో కార్ల విక్రయం నిలిపేసేందుకు కార్ల ప్రొడక్షన్‌ని నిలిపేసింది. కార్ల అమ్మకాల్లో పెరుగుదల లేకపోవడంతో 2022లో ఎగుమతులని ఉపసంహరించుకుంది. ఆసియాలోని ప్రముఖ కార్ కంపెనీల గట్టి పోటీ కారణంగా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ మార్కెట్‌గా ఉన్న భారత్ నుంచి నిష్ర్కమించింది. తాజాగా ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్ కోసం ఎగుమతులు చేయడానికి తిరిగి ప్లాంట్‌ని రీ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోందని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ తయారు చేయాలనుకుంటున్న కార్లు, ఇతర వివరాలను తర్వాత ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది. గతంలో చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ కార్లు, ఇంజన్లను తయారు చేసేంది.