Football-Sized Tumour: న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా 32 ఏళ్ల మహిళ కడుపు నుంచి నాలుగు కిలోల భారీ మెసెంటెరిక్ కణితిని విజయవంతంగా తొలగించినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేపాల్‌కు చెందిన మహిళకు విపరీతమైన నొప్పి రావడంతో ఢిల్లీలోని సీకే బిర్లా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె కడుపులో 4కిలోల బరువు గల 40 సెంటిమీటర్ల పొడవైన కణితి ఉన్నట్లు నిర్ధారణైంది.
పెద్ద కణితిని తొలగించే శస్త్రచికిత్స కీహోల్ లాపరోస్కోపీ టెక్నిక్‌ని ఉపయోగించి శస్త్రచికిత్సను నిర్వహించారు. సాధారణంగా శిశువు ప్రసవానికి సిజేరియన్ చేసేటప్పుడు పొట్టను కోసే విధంగా శస్త్రచికిత్స చేపట్టి కణితిని తొలగించారు. ఈ చికిత్స వల్ల గా పొత్తికడుపుపై మచ్చలు లేకుండా తక్కువ నొప్పిని నిర్ధారిస్తుంది. “నా పరిస్థితి గురించి తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆందోళన చెందాను. కణితి పరిమాణం కారణంగా ఖాట్మండు, ఢిల్లీలోని అగ్రశ్రేణి ఆసుపత్రుల్లో కూడా శస్త్రచికిత్సకు సిద్ధంగా లేవు. ఢిల్లీలోని సీకే బిర్లా ఆసుపత్రిలో కణితిని తొలగిస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. దీనితో లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నాకు నమ్మకం కలిగించింది” అని 32 ఏళ్ల వయస్సు గల రోగి అన్నారు.
శస్త్రచికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన అమిత్ జావేద్ మాట్లాడుతూ.. కణితిని వెలికి తీయడం సిజేరియన్‌లో లాగా పెద్ద సైజు బిడ్డను ప్రసవించినట్లేనని అన్నారు. “ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స, ఎందుకంటే పొత్తికడుపు కుహరాన్ని ఆక్రమించిన కణితి, లాపరోస్కోపిక్ సర్జరీ చేయడానికి మాకు పొత్తికడుపులో చాలా తక్కువ స్థలాన్ని ఇచ్చింది. అదనంగా కణితి చాలా పెద్దదిగా, భారీగా ఉండటం వల్ల శస్త్రచికిత్స చేయడం కష్టతరం అయింది.” అని వైద్యుడు అమిత్ జావేద్ చెప్పారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
Earthquake: చైనా, అఫ్ఘానిస్తాన్‌ను అతలాకుతలం చేసిన భూకంపం.. భారీగా మరణాలు
పెరిటోనియం (ఉదరంలోని చాలా అవయవాలను కప్పి ఉంచే కణజాలం), శోషరస కణజాలం, కొవ్వు, బంధన కణజాలం వంటి ఏదైనా మెసెంటెరిక్ భాగాల నుంచి కణితి ఏర్పడవచ్చు. మెసెంటెరిక్ కణితులు సాధారణంగా యాదృచ్ఛికంగా లేదా ఏదైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు మాత్రమే బయటపడతాయి.